Monday, June 2, 2014

అష్ట చెమ్మ ఆడుదాం రండి....

అష్ట - చెమ్మ
పాత రోజుల్లో గ్రామాల్లో ప్రజల వ్యాపకాల్లో ఈ ఆటకు పెద్ద పీట ఉండేది. ముఖ్యంగా ఇంటిదగ్గర ఉండే మహిళలు, పిల్లలు, వృద్దులు ఆడుకోవటానికి సులువుగా ఉంటుంది. కొత్తవాళ్ళు ఆట నేర్చుకోవడం పెద్ద కష్టం కాదు. నేర్చుకున్న మొదట్లో గెలవటం అంత సులువూ కాదు. కాని గెలిచే అవకాశాలు ఎల్లప్పుడూ ఉంటాయి. ఆడుతున్నకొద్దీ ప్రతిభ సంపాదించి గెలవటానికై ఎదుటివారితో రంజుగా పోరాడవచ్చు. సరిగ్గా చెప్పాలంటే అవిశ్రాంత ప్రమోదానికి చక్కని కాలయాపన ఈ ఆట.
ఓడిపోకూడదన్న కోరిక మనసులో ఒకలాంటి భావావేశాన్ని కలిగిస్తుంది. గెలిస్తే చక్కటి తృప్తిని కలిగిస్తుంది. ఓడిపోతే ఆ తరువాత ఆటలో ఎలా అయినా గెలవాలన్న తపనను రగిలిస్తుంది. పనిలేని సమయము నిస్సారంగా గడిచిపోయేకంటే మనోరంజకంగా గడవటం మేలేకదా?
ఈ ఆటకు ఒకసారి అతుక్కుపోతే ఇక వదలబుద్ది కాదు. ఆట తరువాత ఆట ఆడాలనిపిస్తుంది. మరీ మునిగిపోతే సమయం చాలా వృధా అయ్యే ప్రమాదం కూడా ఉంది.
ఇందులో ఉన్న సౌలభ్యం ఏమిటంటే...
1. ఆట ప్రారభించడానికి ఇద్దరు గాని లేదా నలుగురు గాని ఉంటే సరిపోతుంది.
2. ఖర్చుతో కూడుకున్న వస్తువులు అక్కర్లేదు.
3. అనుకున్నదే తడవుగా ప్రారంభించవచ్చు.
4. ఆట మధ్యలో చిన్న చిన్న ఇతర పనులు కూడా చేసుకోవచ్చు.
5. ఇంట్లో కూర్చుని ఆడుకునే ఆట కనుక, ఎండలోకి, బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు.
6. ఎత్తుకు పై ఎత్తు వేయగలిగే జ్ఞానాన్ని కలిగిస్తుంది.


నిజానికి ఇది తెలివితేటలు పెట్టి ఆడే ఆటలా అనిపించదు. ఎందుకంటే... గవ్వలు విసిరితే వచ్చే విలువను పావులు నడపటానికి (నప్పటానికి) పెద్ద జ్ఞానం అక్కర్లేదని బావించవచ్చు. ప్రాథమిక స్థాయిలో ఇది నిజమే కావచ్చు. కాని రాన్రాను ఆట గెలవటంలో బుద్దికుశలతకు చాలా ప్రాధాన్యత ఉందని అర్ధమవుతుంది.

ప్రారంభించే ముందు కొన్ని ఉపయోగకరమైన పదాలు పరిచయం చేసుకుందాం.
అష్ట - పన్నెండు (నిజానికి అష్ట అంటే ఎనిమిది. ఆ కథ తరువాత తెలుసుకుందాం.)
చెమ్మ - ఆరు
నాలుగు
మూడు
రెండు
కన్ను (కిన్ను)
- ఒకటి. దీన్ని ఒక్కోచోట ఒక్కోరకంగా పిలుస్తున్నారు.
జోడత - అష్ట పడినప్పుడు మాత్రమే ఆరంభ గదిలోకి దిగగలిగే పావు.
పిక్క (పావు) - చెమ్మ పడినప్పుడు ఒకటి, అష్ట పడినప్పుడు రెండు ఆరంభ గదిలోకి దిగగలవు.
ఆరంభ గది - చెమ్మ గాని అష్ట గాని వేసినపుడు బయట ఉన్న పావులు ఆటలో తిరగటానికై లోపలికి ప్రవేశించిన గది
 
విశ్రమ గది - ఈ గదిలో గల పావులను ఎదుటివారు తెగ్గొట్టటానికి వీలులేదు.
పంట గది - చివరిగా చేరుకోవలసిన గది.

Friday, July 22, 2011

తెలుగుకు తెగులు పట్టించిన గూగిల్......

గూగిల్ తమ యూజర్లకు అందించిన అద్భుతమైన సదుపాయాల్లో ట్రాన్స్లేట్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఈమధ్యనే చాలా భాషల నుంచి తెలుగులోకి చేయగల ట్రాన్స్లేట్ ను ప్రవేశ పెట్టింది. ఇది తెలిసి నేను చాలా ఆనందించాను. కాని ఉపయోగించటం మొదలు పెట్టాక నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి కలిగింది. అందుకు నిదర్శనం ఈ క్రింది చిత్రం.









(చింత్రంపై క్లిక్ చేసి చెద్దదిగా చూడవచ్చు)









ఇది గూగిల్ నుంచి తీసిన స్క్రీన్ షాట్ అని వేరే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఒకసారి పైన ఇంగ్లీషులో ఉన్న మేటర్ చదివి, దానితో క్రింద గూగిల్ ట్రాన్స్లేట్ చేసిన తెలుగు సమాచారాన్ని పోల్చి చూడండి. తప్పకుండా మీకు కూడా నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి రాక మానదు. "right?" అనే పదానికి పైన "అవునా?" అని అర్థం వస్తుంది. కాని ట్రాన్స్లేట్ "కుడి" అని మార్చి పూర్తిగా అర్థమే మార్చేసింది.
మీరే గూగిల్ ట్రాన్స్లేట్ లోకి వెళ్లి ఇంగ్లీషు నుంచి తెలుగుకు మరియు తెలుగు నుంచి ఇంగ్లీషుకు తర్జుమా చేసి చూడండి, ఎంత వింత వింత ఫలితాలు వస్తాయో.

ఏదైతేనేం ఒక ప్రయత్నం ప్రారంభమైంది. తొందరలోనే తెలుగు ట్రాన్స్లేట్ మరింత అభివృధ్ది చెంది గ్రామర్ తప్పులు కూడా లేకుండా తర్జుమా చేయగల్గుతుందని ఆశిద్దాం..... ఏమంటారు?

Thursday, May 13, 2010

Can we get transparent images direct from our camera?

Is it possible? Can we get transparent images directly from our camera?

Exactly what is Transparency?
Observe the below two images. First one is directly shot by camera. It contains the object which we want. And it contained background also, which we don't want. Second image is the transparent one which is edited in Photoshop (professional image editing software.) Only the person was separated from background. Now we can put the person in any image! (Third image)

Wednesday, September 9, 2009

Icons jumbled in my iPod

Some time you will stun when you saw your iPod. All of Icons (Artwork) in the Album view got jumbled. It is very irritating situation. Don't worry about it. It is an easy to solve problem. Just follow the below Tips

1. Connect your IPod to computer. open ITunes. (I think it is already installed it in your PC.)

2. In left side pane in DEVICES Section select your IPod. I selected here "Giri iPod" (Image_01)

3. In right side pane, now you can find some tabs like "Summary, Music, Movies, TV Shows,.......". Now select "Music" tab. (Image_02)

4. Remove tick mark before "Display album artwork on your iPod" check-box. Hit on "Apply" button below the right side.

It will remove all the Icon Cache of 'Album-Artwork' from your iPod. (If you now disconnect your iPod and observe the artwork, no Album Artwork will found! Because, icon cache removed from your iPod!)

5. Then Re-tick the above removed check-box. It will take some time to recover Artworks from Albums and rebuild the Icon Cache.

6. After completed the process, disconnect your iPod from computer.

Now all of your Album-Artwork get correct position.

That's it.
Enjoy